
జనరల్

పిఠాపురం నియోజకవర్గ మహిళలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుకగా చీరలు, పసుపు, కుంకుమలను అందించారు. దాదాపు 10 వేల మంది మహిళలకు ఈ కానుకలను పంపిణీ చేశారు. పిఠాపురంలోని శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు.
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఐదు విడతలుగా నిర్వహించిన వరలక్ష్మీ వ్రతాల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం పోలీసులు, ఆలయ, మున్సిపల్ సిబ్బంది, జనసేన వాలంటీర్లు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!