

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ క్రీడా మైదానాలు, స్టేడియాల్లో శిక్షణ ఫీజులను పెంచడంపై బీజేపీ రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ కన్వీనర్, హెచ్‌సీఏ మాజీ కార్యవర్గ సభ్యుడు చిట్టి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పెంచిన కోచింగ్ ఫీజులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ క్రీడా వసతుల్లో శిక్షణ పొందుతున్న వారిలో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారేనని, ఫీజుల పెంపు వారిపై అదనపు భారం మోపుతుందని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్య హక్కులను కేంద్రం హైదరాబాద్‌కు కేటాయించిందని శ్రీధర్ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల విజ్ఞప్తులను పక్కనపెట్టి తెలంగాణకు అవకాశం ఇచ్చిన కేంద్రం, పోటీల నిర్వహణకు సుమారు రూ.70 కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కోచింగ్ ఫీజులు, స్టేడియాల అద్దెలను పెంచడం బాధాకరమన్నారు. క్రీడాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఫీజుల పెంపు కంటే కోచ్‌ల సంఖ్య, శిక్షణ ప్రమాణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!