2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ

Writer: Shivani K 05:28 AM, 2 అక్టోబర్, 2026
ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ

కృత్రిమ మేధ ఆధారంగా సేవలు వేగంగా అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ ప్రభుత్వ సేవల వ్యవస్థలు కూడా మారాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన శతాబ్ది ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ప్రజలు వారాలు, నెలలు వేచి ఉండే పరిస్థితిని కోరుకోవడం లేదని, ఏఐ వేలాది పత్రాలను క్షణాల్లో ప్రాసెస్ చేయగలుగుతున్నప్పుడు ప్రభుత్వాల నుంచి కూడా వేగవంతమైన, రియల్‌టైమ్ పరిష్కారాలను ఆశిస్తున్నారని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సివిల్ సర్వీసెస్ ఎంపిక, నియామక విధానాల్లో మార్పులు రావాలని సూచించారు. అభ్యర్థి విషయ పరిజ్ఞానంతో పాటు ప్రజాసేవలో చేరాలనే ఉద్దేశం, ప్రేరణను కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలే పరమావధిగా ఆధునిక పాలనా వ్యవస్థ పనిచేయాలని మోదీ పేర్కొన్నారు. ‘దేశమే ముందు, పౌరులకే ప్రాధాన్యం’ అనే రెండు సూత్రాలను గుర్తుంచుకోవాలని, ప్రజానుకూలత, క్రియాశీలత, సుపరిపాలన ఆధారంగా 21వ శతాబ్దపు పరిపాలనా విధానం ఉండాలని అన్నారు. పరీక్షలు, నియామక ప్రక్రియలను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసే దిశగా పరీక్షల నిర్వహణ సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సుదీర్ఘంగా పరీక్షల ప్రక్రియ కొనసాగితే అభ్యర్థులపై కోచింగ్ ఫీజులు, అద్దె, రవాణా వంటి అదనపు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. యూపీఎస్సీ శతాబ్ది సందర్భంగా ప్రత్యేక నాణెం, తపాలా బిళ్లతో పాటు పుస్తకాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?

రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉందంటే?

రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉందంటే?

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

ట్యాగ్లు
నరేంద్ర మోదీయూపీఎస్సీయూపీఎస్సీ శతాబ్దికృత్రిమ మేధఏఐసివిల్ సర్వీసెస్ప్రభుత్వ సేవలునియామక ప్రక్రియసుపరిపాలనప్రజాసేవ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ
జనరల్

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ
జనరల్

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ
జనరల్

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ

రంగనాయక సాగర్‌పై హరీశ్‌రావు కీలక డిమాండ్
రాజకీయాలు

రంగనాయక సాగర్‌పై హరీశ్‌రావు కీలక డిమాండ్

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?
జనరల్

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?

రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉందంటే?
జనరల్

రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉందంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.
జనరల్

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్
జనరల్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు
జనరల్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!