
జనరల్

రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లింపుల్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని పెన్షన్ మొత్తాలను నగదు రూపంలో కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేయూత పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో సుమారు 42 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు ఇతర లబ్ధిదారులు పెన్షన్లు పొందుతున్నారు. ఇప్పటివరకు కొంతమందికి నగదు రూపంలో పంపిణీ జరుగుతుండగా, ఇకపై పూర్తిగా డిజిటల్ విధానానికి మారాలని ప్రభుత్వం నిర్ణయించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!