
జనరల్

నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి న్యూఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయ ప్రతినిధి ఛార్జ్ డి అఫైర్స్‌కు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఈ దాడిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారికంగా డిమాండ్ చేసింది.
అంతేకాకుండా, పౌర వాణిజ్య నౌకలపై దాడులు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని భారత్ స్పష్టం చేసింది. ఈ ఘటనలో మరో భారతీయ నావికుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతీయ సీఫేరర్లు ప్రాణాలు కోల్పోయిన తొలి ఘటన ఇదేనని అధికారులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!