

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా తరహాలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి పలు రంగాల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలే కారణమని అధికారులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే ప్రత్యేక వ్యవస్థ అవసరమని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదిత విభాగం వాణిజ్య పన్నులు, గనులు, పౌర సరఫరాలు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వంటి కీలక శాఖలపై సమగ్ర నిఘా ఉంచే విధంగా రూపొందించనున్నట్లు సమాచారం. అన్ని శాఖలకు ఒకే నిఘా వ్యవస్థను తీసుకురావడం ద్వారా అవినీతిని అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఆదాయ లీకేజీలను నివారించి ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!