

కెనడాలో స్థిరపడిన తెలుగువారు తమ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఒంటారియో రాష్ట్రంలోని ఓక్‌విల్లేలో టీమ్ యువ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. యువత అంతా ఒకే బృందంగా ఏర్పడి గణనాథుడి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. స్వదేశానికి దూరంగా ఉన్నప్పటికీ భారతీయ పండగల సంప్రదాయాలను కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీమ్ యువ ప్రతినిధులు తెలిపారు.
రానున్న తరాలకు భారతీయ పండగల విశిష్టతను తెలియజేయడంతో పాటు పిల్లలు తమ సంస్కృతి, సంప్రదాయాలకు దగ్గరగా ఉండేలా ఇటువంటి వేడుకలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఓక్‌విల్లే మేయర్ రాబ్ బర్టన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. భారతీయ పండగలు ఎంతో రంగులమయంగా, ఉత్సాహభరితంగా ఉంటాయని ఆయన ప్రశంసించారు. గణేష్ ఉత్సవాలు భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని చాటిచెబుతున్నాయని తెలిపారు. రఘు యాదవ్, మధు రెడ్డి, వెంకట్ రెడ్డి, శివకుమార్ పుల్లెమెల, హరీశ్వర్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, శివకుమార్, అరుణ్ రెడ్డి, మనీష్, దినేష్, కార్తిక్ రెడ్డి, నాగ సాయి, ధర్మ, శశిధర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి తదితరుల నేతృత్వంలోని కమిటీ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!