

ముంబై తీర ప్రాంతాల్లో ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంతో ఫ్లోటింగ్ అడ్వర్టైజింగ్ బార్జీలు, భారీ ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు యోచిస్తోంది. జుహు బీచ్, లోటస్ జెట్టీ, బాంద్రా-వర్లీ సీ లింక్ జెట్టీ సహా సుమారు 20 ప్రాంతాల్లో ఈ ప్రకటనల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఓడరేవు సౌకర్యాలు, జల రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.
అయితే, ఈ ప్రతిపాదనపై పర్యావరణవేత్తలు, స్థానిక నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంత నిబంధనల అమలు, సముద్ర జీవులపై ప్రభావం, ముంబై తీర సౌందర్యానికి కలిగే నష్టం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రకటనల బార్జీల ఏర్పాటుకు అవసరమైన పర్యావరణ అనుమతులు పొందారా అనే అంశంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో చేపట్టే ఈ ప్రణాళిక అమలులో పర్యావరణ పరిరక్షణ, తీర ప్రాంత నియమాల పాటింపు కీలకంగా మారనున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!