

ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ముంబయిలోని ప్రముఖ లాల్‌బాగ్చా రాజా దర్శనంలో వీఐపీ సంస్కృతిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆలయ దర్శనాలను ప్రచార కార్యక్రమాలుగా మార్చడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్లు, సెల్ఫీలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. లాల్‌బాగ్చా రాజా వద్ద వీఐపీ దర్శనం ఎందుకు ఉండాలంటూ ప్రశ్నిస్తూ.. దేవుడి ముందు కోటీశ్వరులు, ప్రముఖులు, సామాన్య భక్తులు అందరూ సమానమేనని, ప్రతి ఒక్కరూ ఒకే క్యూలో నిలబడాలని అభిప్రాయపడ్డారు.
గణేశోత్సవం సందర్భంగా లాల్‌బాగ్చా రాజా దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో గోయెంకా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే లాల్‌బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండల్ అధికారిక సమాచారం ప్రకారం, మండల్ ఎలాంటి వీఐపీ పాస్‌లు జారీ చేయదు, దర్శనానికి భక్తుల నుంచి రుసుము వసూలు చేయదు. మండల్ ముంఖ్ దర్శన్, చరణ్ స్పర్శ్ దర్శన్ సదుపాయాలను అందిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!