

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నాగర్‌కర్నూల్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
హైదరాబాద్ నగరంలో సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, పోలవరం, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!