
జనరల్

తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా, కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!