
రాజకీయాలు

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లా మర్రిపాలెంలో అత్యధికంగా 26.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు తీరం దాటిన తుపాను నెమ్మదిగా కదులుతూ బలహీనపడుతోంది. ప్రస్తుతం తెలంగాణ వైపు పయనిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!