

భూపాలపల్లి సింగరేణి ఏరియాలో విధుల నుంచి తొలగించబడిన ఉద్యోగులకు సంస్థ మరో అవకాశం కల్పించింది. గైర్హాజరు కారణంగా 2023 నుంచి 2025 మధ్య ఉద్యోగాలు కోల్పోయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పునఃనియామకానికి సంబంధించిన దరఖాస్తులను పరిశీలించేందుకు హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పునఃనియామకానికి దరఖాస్తు చేసుకునే వారు 2026 ఏప్రిల్ నాటికి 46 ఏళ్ల వయసు లేదా అంతకంటే తక్కువ వయసు కలిగి ఉండాలి. అలాగే గత ఐదేళ్లలో ఏవైనా రెండేళ్లలో కనీసం 100 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు వైద్యపరంగా కూడా ఫిట్‌గా ఉండటం తప్పనిసరి. అర్హత కలిగిన మాజీ ఉద్యోగులు ఈ నెల 14లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. నిర్దేశించిన అర్హతల ఆధారంగా దరఖాస్తులను పరిశీలించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!