

మేడ్చల్‌లోని వాణి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో చేపట్టిన కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో ఇష్టానుసారంగా జోక్యం చేసుకోవడం రంగనాథ్‌కు అలవాటుగా మారిందని వ్యాఖ్యానిస్తూ, ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు ఎన్ని ఉన్నాయో, వాటికి విరుద్ధంగా హైడ్రా ఎన్ని కూల్చివేతలు చేపట్టిందో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైడ్రా చర్యల కారణంగా ఇతర అధికారులు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వస్తోందని, అధికారుల వ్యవహారశైలితో కోర్టు విలువైన సమయం వృథా అవుతోందని న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!