

కేవలం 15 ఏళ్ల వయసులోనే మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన పరిణతిని చూపిస్తున్నాడు. ముఖ్యంగా డీఆర్‌ఎస్ విషయంలో అతడి నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దులీప్ ట్రోఫీలో ఇప్పటికే మూడు విజయవంతమైన రివ్యూల్లో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అతడిని డీఆర్‌ఎస్ స్పెషలిస్ట్‌గా అభివర్ణిస్తున్నారు. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో రికీ భుయ్ వికెట్ విషయంలో అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో వైభవ్ పదేపదే ఇషాన్ కిషన్‌ను రివ్యూ తీసుకోవాలని కోరాడు. అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టమైన స్పైక్ కనిపించడంతో భుయ్ ఔటయ్యాడు.
ఇషాన్ కిషన్ మైదానం వీడిన తర్వాత ఈస్ట్ జోన్‌కు వైభవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మహ్మద్ షమి బౌలింగ్‌లో స్మరన్ రవిచంద్రన్ బ్యాట్ అంచుకు బంతి తగిలినట్లు అనిపించడంతో మరో రివ్యూకు వైభవ్ అంగీకరించాడు. అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టమైన స్పైక్ రావడంతో స్మరన్ 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ ఇషాన్ కిషన్ గాయంతో మైదానం వీడటంతో వైభవ్ కెప్టెన్సీ చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్యన్ జుయాల్ క్యాచ్ విషయంలో అతడు సూచించిన రివ్యూ కూడా విజయవంతమైంది. సెమీఫైనల్, ఫైనల్‌లో వైభవ్ సూచించిన మూడు డీఆర్‌ఎస్ రివ్యూలు సక్సెస్ కావడం అతడి క్రికెట్ తెలివితేటలను చాటుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!