

హైదరాబాద్లోని కాప్రా చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా వేగవంతం చేసింది. సుమారు రూ.35 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. చెరువులోని 112.80 ఎకరాల పూర్తి నీటిమట్టం (ఎఫ్టీఎల్) పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ పనులకు సహకారంగా రైతులు స్వచ్ఛందంగా 70 ఎకరాల భూమిని అందించారు. చెరువు పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పరిసర ప్రాంతాల పర్యావరణాన్ని మెరుగుపరచడంపై హైడ్రా దృష్టి సారించింది.
కేంద్ర ప్రభుత్వం గుర్తించిన చిత్తడి నేలగా ఉన్న కాప్రా చెరువు 470కి పైగా వలస పక్షులకు ఆవాసంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో చెరువులో జీవవైవిధ్య పరిరక్షణకు హైడ్రా ప్రాధాన్యం ఇస్తోంది. పూడికతీత, చెరువు లోతు పెంపు, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, ఫెన్సింగ్ ఏర్పాటు, నీటి ప్రవాహం కోసం ఇన్లెట్, ఔట్లెట్ వ్యవస్థల అభివృద్ధి వంటి పనులు చేపడుతోంది. ఈ చర్యల ద్వారా కాప్రా చెరువును పర్యావరణహితంగా తీర్చిదిద్దడంతో పాటు స్థానికులకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!