
టెక్నాలజీ

ఐఐటీ కాన్పూర్‌కు సంబంధించిన ఆర్టీఐ సమాధానం ఉన్నత విద్యలో సామాజిక ప్రాతినిధ్యంపై చర్చకు దారితీసింది. ఆర్టీఐ వివరాల ప్రకారం, సంస్థలో మొత్తం 257 మంది ప్రొఫెసర్లు ఉండగా, వారిలో 252 మంది జనరల్ కేటగిరీకి, ముగ్గురు ఓబీసీ కేటగిరీకి చెందినవారు ఉన్నారు. ప్రొఫెసర్ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఎవరూ లేరని వెల్లడైంది.
ఐఐటీ కాన్పూర్‌లో మొత్తం 957 ఫ్యాకల్టీ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 581 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 376 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ వివరాలను ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) వెల్లడిస్తూ, ఫ్యాకల్టీ నియామకాల్లో సామాజిక ప్రాతినిధ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!