

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘మూడు పాని’ చిత్రంలోని ప్రముఖ గీతం ‘ఎన్ ఇనియా పొన్ నిలవే’కు సంబంధించిన కాపీరైట్ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. పాటలోని సంగీతం, స్వరకల్పనపై మాత్రమే ఇళయరాజాకు హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పాట సాహిత్యం, సౌండ్ రికార్డింగ్‌పై ఇళయరాజాకు కాపీరైట్ హక్కులు ఉండవని ధర్మాసనం పునరుద్ఘాటించింది. చిత్ర నిర్మాత నుంచి సౌండ్ రికార్డింగ్ హక్కులు పొందిన ‘సరిగమ’ మ్యూజిక్ లేబుల్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ‘అఘతియా’ చిత్రంలో పాటను పునఃసృష్టించిన వెర్షన్‌కు సంబంధించిన లైసెన్స్ వివాదంపై ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!