

ఒడిశాలోని గజపతి జిల్లాలో నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ క్యాసినోపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో సుమారు 70 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడుల సందర్భంగా రూ.12 లక్షల నగదు, తొమ్మిది కార్లు, 60 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామం ఏపీ–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వివరాలు, క్యాసినో నిర్వహణలో వారి పాత్ర, స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అక్రమ జూద కార్యకలాపాల నిర్వహణ వెనుక ఎవరున్నారు? ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై పోలీసుల దర్యాప్తుతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!