

హర్మూజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయులు ఉండగా, వారిలో 21 మందిని సురక్షితంగా రక్షించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో ముగ్గురు భారతీయులు గల్లంతైనట్లు తెలిపింది. వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ ఒమన్ అధికారులతో సమన్వయం చేస్తోందని పేర్కొంది.
ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరగడం ఆందోళనకరమని భారత్ అభిప్రాయపడింది. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించి, శాంతి మరియు స్థిరత్వం పునరుద్ధరణకు దౌత్యపరమైన పరిష్కారాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకాయానం మరియు పౌర మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేయాలని కోరింది. ఇదే సమయంలో అమెరికా చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ, దిల్లీలోని అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్‌కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!