

ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో విజయాన్ని అందుకుంటున్న టాలెంటెడ్ దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్‌కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. ఆ ఇంటర్వ్యూలో తన తొలి చిత్రం ‘హృదయ కాలేయం’ విడుదలకు ముందు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. సినిమా కోసం తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేశానని, తర్వాత మ్యూజిక్ హక్కులు అమ్మగా రూ.1.5 లక్షలు వచ్చినట్లు తెలిపారు.
ఆ డబ్బుతో ఆడియో ఫంక్షన్ నిర్వహించి సినిమాపై ఆసక్తి పెంచాలని భావించినట్లు చెప్పారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను సంప్రదించి తన బడ్జెట్ వివరాలు చెప్పి ఫంక్షన్ ప్లాన్ చేశారు. సంపూర్ణేష్ బాబు పరిచయాలు, జబర్దస్త్ టీమ్ సభ్యులు హాజరవుతారని నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈవెంట్ సమయం దగ్గరపడే కొద్దీ ఎవరూ ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, చివరి నిమిషంలో చాలామంది హ్యాండ్ ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. చివరకు సంపూర్ణేష్ బాబు కోసం స్పీచ్ సిద్ధం చేసి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!