17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు

Writer: Shivani K 03:16 PM, 17 సెప్టెంబర్, 2026
మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు

వారణాసిలో నిర్వహించిన వారణాసి–వడ్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు సేవా సంకల్ప్‌ అభియాన్‌ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు హిందీలో ప్రసంగిస్తూ.. కాశీ పవిత్ర భూమిపై నిలబడటం తనకు గర్వకారణమని అన్నారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి దేశానికి ఒక నాయకుడిని అందించిందని పేర్కొన్నారు. మోదీ పాలనలో పేదరిక నిర్మూలన, ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, తాగునీటి సదుపాయాలు, పీఎం కిసాన్‌ వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలిగిందని చంద్రబాబు అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా విధానాలతో భారత్‌ రక్షణ రంగంలో దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదిగిందని పేర్కొన్నారు. స్టార్టప్‌లు, అంతరిక్షం, డ్రోన్లు, సెమీకండక్టర్లు, క్వాంటమ్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌ రంగాల్లో యువతకు అవకాశాలు పెరిగాయని తెలిపారు.

మహిళా సాధికారత కోసం కేంద్రం చేపట్టిన పథకాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. నారీ శక్తి అధినియం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చర్యను ప్రస్తావిస్తూ, ఇది కీలకమైన మార్పుగా అభివర్ణించారు. ఆపరేషన్‌ సింధూర్‌ ద్వారా భారత్‌ తన రక్షణ సామర్థ్యాన్ని చాటుకుందని, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను అభినందిస్తున్నానని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిందని పేర్కొంటూ, అక్కడ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం 10 ఎకరాలు కేటాయించాలని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం, ముఖ్యంగా బ్రహ్మపుత్ర, గంగా, మహానది, కావేరి, గోదావరి నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ భాగస్వామ్యాన్ని ఏపీ బలోపేతం చేస్తోందని, అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారని చంద్రబాబు అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

భారత్‌ సెమీకండక్టర్‌ ప్రయాణంలో కీలక మలుపు.. మోదీ

భారత్‌ సెమీకండక్టర్‌ ప్రయాణంలో కీలక మలుపు.. మోదీ

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడువారణాసివడ్నగర్సేవా సంకల్ప్ అభియాన్నరేంద్ర మోదీఎన్డీఏఆంధ్రప్రదేశ్అమరావతిపోలవరంనదుల అనుసంధానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహేష్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం కేసు
రాజకీయాలు

మహేష్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం కేసు

నిజాం మంచోడైతే తెలంగాణ కోసం ఎందుకు పోరాడారు?: కిషన్‌ రెడ్డి
రాజకీయాలు

నిజాం మంచోడైతే తెలంగాణ కోసం ఎందుకు పోరాడారు?: కిషన్‌ రెడ్డి

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ
జనరల్

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌
జనరల్

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం
సినిమాలు

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు
జనరల్

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు
జనరల్

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

భారత్‌ సెమీకండక్టర్‌ ప్రయాణంలో కీలక మలుపు.. మోదీ
జనరల్

భారత్‌ సెమీకండక్టర్‌ ప్రయాణంలో కీలక మలుపు.. మోదీ

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం
జనరల్

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ
జనరల్

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!