17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

Writer: Shivani K 03:04 PM, 17 సెప్టెంబర్, 2026
ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలోని 100 మందుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టగా, 55 దుకాణాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో భారీగా ట్రామాడోల్‌ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో ట్రామాడోల్‌ ఇంజెక్షన్లను పెద్దమొత్తంలో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది శ్రీలక్ష్మీ శ్రీనివాస మెడికల్‌ ఏజెన్సీ 20 వేల ట్రామాడోల్‌ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. గుట్టుచప్పుడు కాకుండా నిల్వ చేసిన 7,550 ట్రామాడెక్స్‌ ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని జంగారెడ్డిగూడెం, మేడ్యానపు వరిగూడెం, వేగవరం, కుక్కునూరు తదితర ప్రాంతాల్లోని మందుల దుకాణాలు, వ్యక్తులకు సరఫరా చేసినట్లు గుర్తించారు.

మరోవైపు డి.రూపా పెడ్డింటి మెడికల్‌ ఏజెన్సీ నకిలీ బిల్లులతో 5,200 ట్రామెక్‌ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో 3,930 ఇంజెక్షన్లను తెలంగాణలోని ఓ మందుల దుకాణానికి విక్రయించినట్లు బిల్లుల్లో చూపించినప్పటికీ, ఆ లావాదేవీలన్నీ నకిలీవని తెలంగాణ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని గుర్తించిన శ్రీలక్ష్మీ శ్రీనివాస మెడికల్‌ ఏజెన్సీ, డి.రూపా పెడ్డింటి మెడికల్‌ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ రెండో దశలోకి.. ప్రధాని మోదీ

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ రెండో దశలోకి.. ప్రధాని మోదీ

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ

మంత్రాలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు

మంత్రాలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ క్లారిటీ

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ క్లారిటీ

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో నిందితుడు సరెండర్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో నిందితుడు సరెండర్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్డ్రగ్ కంట్రోల్ అధికారులుమందుల దుకాణాలుట్రామాడోల్ ఇంజెక్షన్లుట్రామాడెక్స్నకిలీ బిల్లులుమెడికల్ ఏజెన్సీలుడ్రగ్స్ తనిఖీలుజంగారెడ్డిగూడెంలైసెన్స్ రద్దు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం
సినిమాలు

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు
జనరల్

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు
జనరల్

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ రెండో దశలోకి.. ప్రధాని మోదీ
జనరల్

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ రెండో దశలోకి.. ప్రధాని మోదీ

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం
జనరల్

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ
జనరల్

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ

మంత్రాలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు
జనరల్

మంత్రాలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు

రేవంత్‌ అజెండా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే: సబితా
రాజకీయాలు

రేవంత్‌ అజెండా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే: సబితా

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ క్లారిటీ
జనరల్

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!