
జనరల్

బ్రిక్స్ సదస్సుకు హాజరైన పలువురు ప్రపంచ నేతలు అనారోగ్యానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారం పూర్తిగా “ఫేక్” అని పేర్కొంటూ, తప్పుడు పోస్టులను నమ్మవద్దని ప్రజలను హెచ్చరించింది.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా బిహార్‌లోని కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండటం, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఆరోగ్యపరమైన సమస్య తలెత్తిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల నేపథ్యంలో MEA ఈ స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వాదనలు అవాస్తవమని విదేశాంగ శాఖ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!