

భారత సెమీకండక్టర్ రంగం రెండో దశలోకి అడుగుపెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాలుగేళ్లలోనే ప్రపంచంలోని ఇతర దేశాలకు సాధారణంగా దశాబ్దం పట్టే స్థాయి పురోగతిని భారత్ సాధించిందని పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా-2026ను న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇప్పుడు సెమీకండక్టర్ సామర్థ్యాల నిర్మాణం నుంచి వాణిజ్య చిప్ ఉత్పత్తి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.
చిప్ రూపకల్పన, తయారీతో పాటు సెమీకండక్టర్ పరికరాలు, ముడి పదార్థాలు, పరీక్షలు, ప్యాకేజింగ్, నైపుణ్యాభివృద్ధి వంటి మొత్తం వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. యువతకు నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు జరిగే సెమీకాన్ ఇండియా-2026లో 52 దేశాలకు చెందిన 600కుపైగా కంపెనీలు, ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ ఏడాది కార్యక్రమం ‘సిలికాన్ నుంచి వ్యవస్థల వరకు: వ్యవస్థ నిర్మాణం’ అనే అంశంతో జరుగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!