

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. పొరుగు దేశాల్లో విధ్వంసం, అశాంతి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించిందని భారత్ ఆరోపించింది. ఉగ్రవాద మూకలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే విధానాన్ని పాకిస్థాన్ అనుసరించిందని, ఇప్పుడు అదే శక్తులు ఆ దేశంలోనే అశాంతికి కారణమవుతున్నాయని వ్యాఖ్యానించింది.
పాకిస్థాన్ స్వయంగా పెంచి పోషించిన ఉగ్రవాద శక్తుల ప్రభావాన్ని ఇప్పుడు ఆ దేశమే ఎదుర్కొంటోందని భారత్ పేర్కొంది. దక్షిణాసియాలో ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, రాజకీయ అస్థిరతపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగించకూడదని, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!