
ఓటీటీ

భారత్‌కు విక్రయించిన కీలక ఆయుధ వ్యవస్థలకు సంబంధించి సర్వీసులు అందించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అల్ట్రాలైట్ హోవిట్జర్ శతఘ్నులకు లాజిస్టిక్స్, నిర్వహణ, శిక్షణ, సాంకేతిక సహాయం అందించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ కాంగ్రెస్‌కు తెలియజేసింది.
ఈ ఒప్పందం విలువ సుమారు రూ.4,557 కోట్లు (482 మిలియన్ డాలర్లు)గా అంచనా వేయబడింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, బీఏఈ సిస్టమ్స్ వంటి కంపెనీలు ఈ సర్వీసుల్లో భాగస్వామ్యం కానున్నాయి. దీంతో భారత రక్షణ వ్యవస్థకు కీలక మద్దతు లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!