

లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన ‘డిసి’ సినిమా అద్భుతమైన విజయంతో బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న తెలుగులో విడుదలై ప్రేక్షకుల నుంచి ఘన స్పందన అందుకుంది. సక్సెస్ మీట్‌లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, “సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనేది ‘డిసి’ మరోసారి నిరూపించింది. లోకేష్ కనగరాజ్ అద్భుతమైన నటనతో హీరోగా సెన్సేషన్ సృష్టించారు” అని అన్నారు. సినిమా టెక్నికల్ వాల్యూస్, అనిరుధ్ సంగీతం, కథనం అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.
నిర్మాతలు సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని, ప్రతి షోకి ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి తమ పాత్రల్లో మెప్పించగా, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ సినిమా అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రివ్యూలు, పెరుగుతున్న స్క్రీన్స్ ఈ సినిమా విజయాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఈ భారీ విజయానికి ప్రేక్షకులందరికీ చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!