
జనరల్

టీడీపీ ముఖ్య నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈవీఎం, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్.. ఏ విధానంలో ఎన్నికలు నిర్వహించినా కూటమికే ప్రజల మద్దతు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల విధానం ఏదైనా కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని సూచించారు.
గ్రామస్థాయి ఎన్నికలను నాయకులు తేలిగ్గా తీసుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు కొత్త నాయకులను తీర్చిదిద్దేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!