

ప్రముఖ తెలుగు సినీనటుడు గిరిబాబు మృతి పట్ల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగుతూ 600కు పైగా చిత్రాల్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారని గుర్తుచేసుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు. గిరిబాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ కూడా గిరిబాబు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు 600కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారని గుర్తుచేసుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గిరిబాబు మరణం సినీ రంగానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!