15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క

Writer: Chandrika 04:39 PM, 15 అక్టోబర్, 2026
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన సమాఖ్య చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌–2026లో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనకు సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతులు అందించడంతో పాటు భూమి, విద్యుత్‌, నీటి వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు గార్డియన్‌గా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు, బహుభాషా సంస్కృతి, అనుకూలమైన వ్యాపార వాతావరణం హైదరాబాద్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలుపుతున్నాయని పేర్కొన్నారు.

హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల అభివృద్ధికి కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (CORE), పెరి అర్బన్‌ రీజియన్‌ (PURE), రూరల్‌ అగ్రికల్చర్‌ రీజియన్‌ (RARE) విధానాల ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. కోర్‌ అర్బన్‌ ప్రాంతంలో ఐటీ, సేవారంగం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమివ్వగా, పెరి అర్బన్‌ ప్రాంతంలో ఫార్మా, బయోటెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాలకు పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు రేడియల్‌ రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి, స్థానిక వనరులకు విలువ జోడించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామని వెల్లడించారు. సంపద కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని, పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

 పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

ట్యాగ్లు
తెలంగాణ పెట్టుబడులుభట్టి విక్రమార్కతెలంగాణ ప్రభుత్వంగ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ 2026హైదరాబాద్‌ వ్యాపారంపారిశ్రామిక అభివృద్ధిసింగిల్‌ విండో అనుమతులుఅంతర్జాతీయ పెట్టుబడులుఉద్యోగ అవకాశాలుప్రాంతీయ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ
జనరల్

వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క

నాలుగో టీ20లో భారత్ ఓటమిపై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

నాలుగో టీ20లో భారత్ ఓటమిపై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..
జనరల్

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు
జనరల్

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం
జనరల్

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌లకు భారీ డిమాండ్‌..
బిజినెస్

హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌లకు భారీ డిమాండ్‌..

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
జనరల్

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ
రాజకీయాలు

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

 పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి
జనరల్

పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు
జనరల్

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు
జనరల్

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ
జనరల్

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!