
జనరల్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధమే ప్రధాన కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధం ఎన్నికలపై ప్రభావం చూపిందన్న విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన ఓటర్ల వైఖరిలో ప్రస్తుతం మార్పు వచ్చిందని వాన్స్ వెల్లడించారు.
ఇరాన్ యుద్ధంపై నెలకొన్న అసంతృప్తి కారణంగా గతంలో రిపబ్లికన్ పార్టీకి మద్దతిచ్చిన కొందరు ఓటర్లు ఈసారి డెమొక్రాట్లకు ఓటు వేశారని ఆయన తెలిపారు. సంప్రదాయ రిపబ్లికన్ మద్దతుదారుల్లోనూ ఈ మార్పు కనిపించిందని పేర్కొన్నారు. యుద్ధం కారణంగా పెరిగిన ధరలు, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయని వాన్స్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!