

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ అవకాశం 2024 జూన్ 1వ తేదీకి ముందే తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి మాత్రమే వర్తించనుంది. ఈ నిర్ణయంతో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పలువురు అభ్యర్థులకు ప్రయోజనం కలగనుంది.
ఈ వెసులుబాటు APPSC, పోలీస్, మెడికల్ బోర్డు నియామకాలతో పాటు డీఎస్సీ ఉద్యోగాల భర్తీకి కూడా వర్తించనుంది. అయితే, అభ్యర్థులు తమ స్థానిక హోదాను నిర్ధారించే పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. మైగ్రేషన్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ, స్థానికతకు సంబంధించిన ధ్రువపత్రాల విషయంలో మాత్రం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!