
జనరల్

అమెరికాలో మధ్యంతర ఎన్నికలపై ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం తీవ్ర ప్రభావం చూపిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఓటర్లలో అసంతృప్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపినట్లు వెల్లడించారు.
అయితే, ఇరాన్‌తో యుద్ధం చేయడం తనకు తప్పనిసరి అయిందని ట్రంప్ సమర్థించుకున్నారు. ఆ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదని, యుద్ధాన్ని కొనసాగిస్తున్నామని బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. మరోవైపు, ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఇరాన్‌తో యుద్ధమే ప్రధాన కారణమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!