24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సన్నాహాలు?

Writer: Nithish 02:43 PM, 24 నవంబర్, 2026
అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సన్నాహాలు?

అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించే దిశగా అగ్రరాజ్యాల మధ్య పోటీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించినట్లు అంగీకరించిందన్న కథనాల నేపథ్యంలో.. రష్యా కూడా అణ్వాయుధంతో కూడిన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని జర్మనీ ఇంటెలిజెన్స్‌ నివేదిక వెల్లడించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా ఈ ప్రయోగానికి సిద్ధమవుతోందని, కేవలం 60 రోజుల్లోనే అణ్వాయుధాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని సమకూర్చుకునే దిశగా మాస్కో చర్యలు చేపడుతోందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ అంశంపై జర్మనీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆ దేశ రక్షణశాఖ మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రష్యా అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరిస్తే, 1963 నాటి పాక్షిక అణు పరీక్షల నిషేధ ఒప్పందం, 1967 నాటి అంతరిక్ష ఒప్పందాల ఉల్లంఘనకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, జర్మనీ నివేదికపై రష్యా స్పందించింది. ఈ నివేదిక గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బెర్లిన్‌లోని రష్యా రాయబార కార్యాలయం కూడా ఈ ఆరోపణలను ఖండించింది. అయితే, రష్యా అణ్వాయుధ సామర్థ్యాలపై అమెరికా గతంలోనూ ఆందోళన వ్యక్తం చేసింది. శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేసే వ్యవస్థను మాస్కో అభివృద్ధి చేస్తోందని 2024లో ఆరోపించగా, క్రెమ్లిన్‌ దానిని ఖండించింది. ఇటీవల ఉక్రెయిన్‌ ఉపయోగిస్తున్న స్టార్‌లింక్‌ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను దెబ్బతీసే అణ్వాయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తోందని అమెరికా మరోసారి పేర్కొంది. ఈ నేపథ్యంలో జర్మనీ ఇంటెలిజెన్స్‌ నివేదిక అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మణికుమార్‌ మృతిపై కేసీఆర్‌, కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

మణికుమార్‌ మృతిపై కేసీఆర్‌, కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

నేర చరిత్ర దాచితే బెయిల్ రద్దే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

నేర చరిత్ర దాచితే బెయిల్ రద్దే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కాకినాడ జిల్లాలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

కాకినాడ జిల్లాలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

రాజీవ్‌ గాంధీ భద్రతపై సోనియా కీలక వ్యాఖ్యలు

రాజీవ్‌ గాంధీ భద్రతపై సోనియా కీలక వ్యాఖ్యలు

డ్రగ్స్‌ రహిత భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కిషన్‌రెడ్డి

డ్రగ్స్‌ రహిత భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కిషన్‌రెడ్డి

ట్యాగ్లు
రష్యాఅంతరిక్షంలో అణ్వాయుధాలుజర్మనీ ఇంటెలిజెన్స్ నివేదికఅమెరికాఅణ్వాయుధ ఉపగ్రహంఅంతరిక్ష భద్రతరష్యా అణు కార్యక్రమంస్టార్‌లింక్ఉక్రెయిన్ యుద్ధంఅంతర్జాతీయ పరిణామాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లేఆఫ్స్‌పై గూగుల్ ఇచ్చిన క్లారిటీ ఇదే!
టెక్నాలజీ

లేఆఫ్స్‌పై గూగుల్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

ఉద్యోగుల తొలగింపులపై సంస్థ స్పష్టత
బిజినెస్

ఉద్యోగుల తొలగింపులపై సంస్థ స్పష్టత

ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన జెన్సన్ హువాంగ్
బిజినెస్

ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన జెన్సన్ హువాంగ్

మణికుమార్‌ మృతిపై కేసీఆర్‌, కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

మణికుమార్‌ మృతిపై కేసీఆర్‌, కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సన్నాహాలు?
జనరల్

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సన్నాహాలు?

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు
జనరల్

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే

నేర చరిత్ర దాచితే బెయిల్ రద్దే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

నేర చరిత్ర దాచితే బెయిల్ రద్దే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కాకినాడ జిల్లాలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు
జనరల్

కాకినాడ జిల్లాలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

ఐటీసీ క్లెయిమ్‌లో ఈ తప్పులు చేస్తే కష్టమే!
బిజినెస్

ఐటీసీ క్లెయిమ్‌లో ఈ తప్పులు చేస్తే కష్టమే!

రాజీవ్‌ గాంధీ భద్రతపై సోనియా కీలక వ్యాఖ్యలు
జనరల్

రాజీవ్‌ గాంధీ భద్రతపై సోనియా కీలక వ్యాఖ్యలు

పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ఎన్డీయే గూటికి అకాలీదళ్‌
రాజకీయాలు

పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ఎన్డీయే గూటికి అకాలీదళ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!