

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ కలిసి పోటీ చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. ఢిల్లీలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా పాల్గొన్నారు. 2020లో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై విభేదాల నేపథ్యంలో అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలిగింది. తాజాగా ఇరు పార్టీల మధ్య మళ్లీ పొత్తు కుదరడంతో పంజాబ్ రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కూటమి ప్రధాన లక్ష్యాల్లో పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం, అవినీతిని అరికట్టడం, జాతీయవాద శక్తులను బలోపేతం చేయడం, రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపడం ఉన్నాయని నేతలు వెల్లడించారు. సీట్ల పంపకంపై పూర్తి వివరాలను ఇంకా ప్రకటించలేదు. అయితే రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేశాయి. గతంలో సుదీర్ఘకాలం మిత్రపక్షాలుగా కొనసాగిన ఈ పార్టీలు మళ్లీ చేతులు కలపడంతో రాబోయే ఎన్నికల్లో పంజాబ్ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయన్న ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!