
సినిమాలు

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల కోసం ‘జగన్ 2.0’ సూపర్ యాప్ను ప్రారంభించారు. కార్యకర్తలు పార్టీతో ఎప్పటికప్పుడు అనుసంధానంగా ఉండేందుకు ఈ డిజిటల్ వేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే పార్టీ కార్యక్రమాల వివరాలు యాప్లో అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించారు.
ఈ యాప్లో వేధింపులకు గురైన కార్యకర్తలు తమ ఫిర్యాదులను డిజిటల్ డైరీ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే పార్టీ నాయకత్వం నేరుగా కార్యకర్తలతో టచ్లో ఉండే విధంగా ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జగన్ పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!