
బిజినెస్

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగింది. దీపథూన్ రాతి స్తంభం సమీపంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పూజారులు దీపారాధన నిర్వహించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత ప్రాంతంలో సంప్రదాయబద్ధంగా దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
కార్తీక దీపం వెలిగించేందుకు సుమారు 30 కిలోల నెయ్యి, 50 మీటర్ల పొడవైన పత్తి వత్తిని వినియోగించారు. అలాగే దీపం వెలిగించేందుకు 5 కిలోల కర్పూరాన్ని ఉపయోగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కొండపై పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. భారీ భద్రత మధ్య దీపారాధన కార్యక్రమం పూర్తయింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!