
బిజినెస్

రష్యాలోని కమ్చత్కా ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:45 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 205 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. భూకంపం లోతు ఎక్కువగా ఉండటంతో ఉపరితలంపై ప్రకంపనల ప్రభావం తగ్గిందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.
కమ్చత్కా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండటంతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గతంలోనూ ఈ ప్రాంతంలో భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. 2025 జులైలో కమ్చత్కా సమీపంలో 8.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తాజా భూకంపంతో మరోసారి ఈ ప్రాంతం భూకంప ముప్పు ఉన్న ప్రాంతమనే విషయం స్పష్టమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!