
బిజినెస్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్, మియాపూర్ వర్క్‌షాపుల్లో బస్సుల రెట్రోఫిట్టింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలిదశలో మొత్తం 250 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు.
ఈ బస్సుల్లో 300 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. డీజిల్ బస్సులతో పోలిస్తే ఒక్కో కిలోమీటరుకు నిర్వహణ వ్యయం రూ.20 వరకు తగ్గే అవకాశం ఉండటంతో సంస్థకు ఇంధన, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!