
జనరల్

ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని అమలు చేస్తూ కేరళం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. నవకేరళ నిర్మాణ దిశగా ఇది ఒక కీలకమైన అడుగని ముఖ్యమంత్రి వీ.డి. సతీశన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక భారం తగ్గడంతో పాటు ప్రజా రవాణా వినియోగం మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
తిరువనంతపురంలోని తంపనూరు కేఎస్‌ఆర్టీసీ బస్ టెర్మినల్‌లో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం తంపనూరు నుంచి సచివాలయం వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఈ పథకానికి అర్హులని ప్రకటించారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరసన కేరళం కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!