
గాసిప్స్

విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఇటీవల ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎంపీ చిన్ని అక్రమాలు, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కేశినేని నాని లేఖ రాసినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్ని పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అనుచిత, పరువునష్టం కలిగించే పోస్టులు చేస్తున్నారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్ని ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!