

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అందం, నటనతో పాటు అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. యాక్షన్, కామెడీ, మ్యూజికల్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో మెరిసిన ఆమె, ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ సినిమాతో అలరించిన జాక్వెలిన్, ఇప్పుడు ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గతంలో సంచలనం సృష్టించిన క్లాసిక్ థ్రిల్లర్ ‘వో కౌన్ థీ’ స్ఫూర్తితో తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిజ జీవితంలోని కొన్ని విచిత్రమైన, భయానక సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో జాక్వెలిన్ వర్కింగ్ ఉమెన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఉత్తర భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో అనుకోకుండా భయానక పరిస్థితుల్లో చిక్కుకున్న యువతి వాటిని ఎదుర్కొనే ప్రయాణం చుట్టూ కథ సాగనుందని టాక్. హారర్ అంశాలతో పాటు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కామెడీ చిత్రాలతో అలరించిన జాక్వెలిన్, ఈ కొత్త జానర్ ప్రయోగంతో తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకోవాలని చూస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!