

ముంబై లోకల్ రైళ్లతో పాటు సెంట్రల్ రైల్వే పరిధిలోని రైళ్లు, స్టేషన్లలో అక్టోబర్ 1 నుంచి 31 వరకు ప్రత్యేక టికెట్ తనిఖీల కార్యక్రమం చేపట్టనున్నారు. టికెట్ల చెల్లుబాటు, అసలుదనం, రాయితీ టికెట్లు, నిర్దిష్ట రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాస్‌ల వినియోగంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. రాయితీ లేదా నిర్దిష్ట కోటా కింద ప్రయాణించే వారు సంబంధిత ఒరిజినల్ గుర్తింపు, అర్హత పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సెంట్రల్ రైల్వే సూచించింది.
ఒకే టికెట్‌పై పలువురు ప్రయాణిస్తుంటే, టికెట్‌లో పేరున్న కనీసం ఒక ప్రయాణికుడు సంబంధిత ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించాలి. అలా చూపించలేకపోతే, నిబంధనల ప్రకారం ఆ టికెట్‌పై ప్రయాణిస్తున్న వారందరినీ చెల్లుబాటు అయ్యే టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించే అవకాశం ఉంది. ఈ-పాస్, పీటీఓపై ప్రయాణించే రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఒరిజినల్ గుర్తింపు పత్రాలను వెంట ఉంచుకోవడంతో పాటు ప్రయాణానికి ముందు వాటిని నిర్దేశిత ప్రయాణ అనుమతిగా మార్చుకోవాలి. రిజర్వేషన్ లేని టికెట్లను కూడా టికెట్ తనిఖీ సిబ్బంది టికెట్ తనిఖీ యాప్ ద్వారా పరిశీలించనున్నారు. ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశం నకిలీ టికెట్లు, రాయితీలు, పాస్‌ల దుర్వినియోగాన్ని అరికట్టడం, రైల్వే ఆదాయ నష్టాన్ని నివారించడం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!