

పేపర్ లీకేజీ వివాదంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నీట్ యూజీ పరీక్షా విధానంలో ప్రక్షాళన దిశగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) కీలక మార్పులకు సిద్ధమవుతోంది. వైద్య విద్య ప్రవేశ పరీక్షను ప్రస్తుతం అమలులో ఉన్న పెన్ అండ్ పేపర్ విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానానికి మార్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్టీయే డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత మార్పులకు సంబంధించిన ప్రణాళికపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకణి నేతృత్వంలోని హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోంది.
ఇదిలా ఉండగా, ఎన్టీయే తన ప్రధాన కార్యాలయాన్ని దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లా నుంచి సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్‌లో ఉన్న భారత ప్రభుత్వ ప్రెస్ బిల్డింగ్‌లోని ఐదో అంతస్తుకు మార్చింది. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, భద్రతా చర్యలను బలోపేతం చేస్తున్న సమయంలో ఈ కార్యాలయ మార్పు చోటుచేసుకుంది. నీట్ యూజీను సీబీటీ విధానంలో నిర్వహించే ప్రతిపాదన పరీక్షా వ్యవస్థలో భద్రత, పారదర్శకతను మెరుగుపరిచే విస్తృత చర్యల్లో భాగంగా ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!