
క్రీడలు

ఇరాన్ దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు దాదాపు నాలుగు నెలల ఆలస్యంగా నిర్వహించబడుతున్నాయి. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఇది అసాధారణ పరిణామంగా భావిస్తున్నారు. ఖమేనీ మరణానంతరం ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరియు అమెరికా తీవ్ర దాడులు జరపడంతో దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయని ఇరాన్ అధికారులు తెలిపారు.
యుద్ధ పరిస్థితుల కారణంగా ఖమేనీ పార్థివ దేహాన్ని తాత్కాలికంగా భద్రపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం మృతదేహానికి రసాయనాలు ఉపయోగించడం నిషిద్ధం కావడంతో, ఎలాంటి రసాయనాలు పూయకుండా కోల్డ్ స్టోరేజ్‌లోనే నాలుగు నెలల పాటు భద్రపరిచినట్లు చెప్పారు. ఇందుకు మత పెద్దల అనుమతి తీసుకున్నామని ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!