

తృణమూల్ కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. భాజపా తమ పార్టీలో చీలికలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీఎంసీలో మార్పులకు కాషాయ పార్టీనే కారణమని, అసమ్మతి నేతలను ప్రేరేపిస్తోందని పేర్కొన్నారు. నిజాయతీ లేని కొందరు నేతలు భాజపాకు అమ్ముడుపోయారని విమర్శిస్తూ, ధైర్యముంటే నేరుగా భాజపాలో చేరి తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఈ పరిణామాల మధ్య ఆమె సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేశారు.
ఇక టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీపై విశ్వాసం లేకపోవడంతోనే తాను వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపారు. తనపై నమ్మకం లేనిచోట కొనసాగడం కష్టమని పేర్కొన్నారు. ఇటీవలే రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, కొద్ది రోజుల్లోనే రాజీనామా చేయడం గమనార్హం. అనంతరం రెబల్ నేతలతో సమావేశం కావడం మరింత ఆసక్తికరంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!