
జనరల్

బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పు రూ.5.16 లక్షల కోట్లు అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ చేసిన రూ.15 వేల కోట్ల అప్పును కూడా బీఆర్‌ఎస్ ఖాతాలో చూపించారని ఆయన విమర్శించారు. “రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు” అంటూ ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ.4.14 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. నిధులు లేకపోయినా సంక్షేమ పథకాలు ఆపలేదని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!