
రాజకీయాలు

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్యవర్తిత్వంపై భారత్‌ను పాకిస్థాన్‌తో పోల్చడంపై చైనాలో భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి తీవ్రంగా స్పందించారు. భారత్‌ను పాకిస్థాన్‌తో పోల్చడం అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు బీజింగ్‌లో జరిగిన ఓ సదస్సులో చైనా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చేశారు.
భారత్ ప్రపంచ దేశాలతో కలిగిన సంబంధాలు, ఆర్థిక, శాంతి–భద్రత రంగాల్లో సహకారం అనేక దేశాలకు అందనంత స్థాయిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతి దేశం తన వాస్తవ పాత్రను గమనించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌కు ఉన్న స్థానం బలమైనదని, పాక్‌తో పోల్చడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!