
జనరల్

దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అనంతరం 14వ తేదీ నాటికి ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన కదలికలు, తీవ్రతను వాతావరణ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. తదుపరి పరిణామాల ఆధారంగా తీర ప్రాంతాలకు వర్ష సూచనలు, హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!